బీసీ జయహో సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కల్యాణ్ , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరుకానున్నారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిన వైనాన్ని సదస్సు ద్వారా నేతలు జనాలకు వివరించనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతు దారులుగా ఉన్నారు. వారికి రక్షణ కల్పించే విధంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చే ఒక అవకాశం ఉంది.
బీసీ డిక్లరేషన్ లో పొందుపరచాల్సిన అంశాలను జనసేనతో పాటు తమ పార్టీ నేతలతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చర్చించారు. సదస్సు ద్వారా సమగ్ర బీసీ డిక్లరేషన్‌ను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడిగా ప్రకటించనున్నారు. జయహో బీసీ సదస్సును ఫెయిల్యూర్ చేసేందుకు వైసీపీ కుయుక్తులు పన్నుతోందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదస్సు కోసం ఆర్టీసీ బస్సులను సైతం అద్దెకివ్వటానికి ప్రభుత్వం నిరాకరించిందని తెలుస్తోంది. నేటి సాయంత్రం నాలుగు గంటలకు బీసీ జయహో సదస్సు ప్రారంభం కానుంది.
source : andhrajyothi.com
Discussion about this post