‘‘2014-19 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు. ఇది బాబు-జగన్మ ధ్య ఉన్న తేడా. ఈ ఎన్నికలకు మా మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నాం. చంద్రబాబు 2014లో ఇచ్చిన మేనిఫెస్టో ఏకంగా అదృశ్యమైపోయింది. వెబ్ సైట్ లో లేదు. మేనిఫెస్టోలను మాయం చేసిన తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు.. మేనిఫెస్టోలో హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి మేనిఫెస్టోను తీసుకెళ్ళి ఇచ్చిన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు జగన్.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్ గారు. అందుకే మరల తిరిగి ఓటు అడగడానికి వెళ్తున్నాం, సిద్దమయ్యాం.. మా టార్గెట్ 175. 175 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి తిరిగి అధికారంలోకి రావాలని టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. దానికి సంబంధించి అనేక మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం చేస్తున్నాం. మేము మేనిఫెస్టో అమలు చేయలేదని అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీకి దమ్ముంటే 2014 మేనిఫెస్టోను తీసుకొచ్చి మాట్లాడాలి.. మా మేనిఫెస్టోని పట్టుకుని మాట్లాడే దమ్ము, ధైర్యం మాకు ఉంది.
source : sakshi.com
Discussion about this post