రాజకీయాలలో శాశ్వత శత్రువులు, నిరంతర మిత్రులు ఉండరన్నది మరోసారి రుజువైంది. 2019 ఎన్నికల్లో హిందూపురం నియోజక వర్గంలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ నుండీ ఢ అంటే ఢ అని పోటి పడిన నందమూరి బాలకృష్ణ, మహ్మద్ ఇక్బాల్ ఇరువురు చిలమత్తూరు జడ్పీటీసి అనూష ఇంటిలో శుక్రవారంక చేతులు కలిపి ఒక్కటయ్యారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా టీడిపి కంచుకోట హిందూపురం నియోజక వర్గం చిలమత్తూరులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ి స్థానాలు కైవసం చేసుకోవడానికి బీసి వర్గం నుండి ప్రత్యేకకృషి చేసిన యాదవ్ బ్రదర్స్ నాగరాజు యాదవ్, లక్ష్మినారాయణ యాదవ్ నందమూరి బాలక్రిష్ణ, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో టీడీపి కండువా వేసుకొని పార్టీలో చేరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇక్బాల్ కి సముచిత స్థానం కల్పిస్తామని ఈసందర్భంగా బాలయ్య అన్నారు. మూడో సారి ముచ్చటగా గెలుస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా హిందూపురంలో నిర్వహించే ర్యాలీకి చిలమత్తూరు నుండి వేల సంఖ్యలో కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు.
source : prajasakthi.com
Discussion about this post