నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్) 1377 బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉత్తీర్ణులైనవారిని కేంద్ర, ప్రాంతీయ ఎన్‌వీఎస్ కార్యాలయాల్లో నియమిస్తారు.
ఫిమేల్ స్టాఫ్‌నర్స్-121: బీఎస్సీ (ఆనర్స్) ఇన్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. 50 పడకల ఆసుపత్రిలో రెండున్నర ఏళ్లు పనిచేసిన అనుభవం అవసరం. హిందీ/ ప్రాంతీయ భాష, ఇంగ్లిష్‌లను అర్థం చేసుకుని పనిచేయగలగాలి.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-5: డిగ్రీ పాసవ్వాలి. అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ విషయాల్లో మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
ఆడిట్ అసిస్టెంట్-12: బీకాం పాసై.. మూడేళ్ల అకౌంట్స్ అనుభవం అవసరం.
జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్-4: హిందీలో మాస్టర్స్ డిగ్రీ.. ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలి. లేదా ఇంగ్లిష్‌లో మాస్టర్స్ డిగ్రీ.. హిందీ తప్పనిసరి సబ్జెక్టుగా చదవాలి. ఏ సబ్జెక్టుతోనైనా హిందీ మాధ్యమంలో పీజీ చేయాలి, ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలి.
లీగల్ అసిస్టెంట్-1: లా డిగ్రీ పాసై.. లీగల్ కేసుల నిర్వహణలో మూడేళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యం అవసరం. వయసు 23 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టెనోగ్రాఫర్-23: ఇంటర్మీడియట్ పాసై నిమిషానికి 80 పదాల వేగంతో డిక్టేషన్ తీసుకుని.. దాన్ని కంప్యూటర్ పైన ఇంగ్లిష్‌లో 50 నిమిషాలు, హిందీలో 65 నిమిషాల్లో ట్రాన్‌స్క్రిప్ట్ చేయగలగాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
కంప్యూటర్ ఆపరేటర్-2: బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) పాసవ్వాలి. లేదా బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) పూర్తిచేయాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.
కేటరింగ్ సూపర్‌వైజర్-78: హోటల్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ పాసవ్వాలి. గరిష్ఠ వయసు 35 ఏళ్లు. లేదా కేటరింగ్‌లో ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ ఉండి పదేళ్ల అనుభవం అవసరం (ఈ అవకాశం ఎక్స్-సర్వీస్‌మెన్‌కు మాత్రమే)
జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్-381: ఇంటర్మీడియట్ పాసై.. టైపింగ్ వేగం ఇంగ్లిష్‌లో నిమిషానికి 30 పదాలు లేదా హిందీలో 25 పదాలు ఉండాలి. లేదా సెక్రటేరియల్ ప్రాక్టీసెస్ అండ్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ ఒకేషనల్ సబ్జెక్టులుగా స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ పాసవ్వాలి. 6 నెలల కంప్యూటర్ డిప్లొమా కోర్సు చేసి, అకౌంట్స్/ అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.
ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్-128: పదో తరగతి పాసై, ఎలక్ట్రీషియన్/ వైర్‌మేన్ ఐటీఐ సర్టిఫికెట్ ఉండి.. ఎలక్ట్రికల్ ఇన్‌స్టలేషన్/ వైరింగ్/ ప్లంబింగ్‌లో రెండేళ్ల అనుభవం అవసరం..
ల్యాబ్ అటెండెంట్-161: పదో తరగతి పాసై ల్యాబొరేటరీ టెక్నిక్‌లో సర్టిఫికెట్/ డిప్లొమా ఉండాలి. లేదా సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పాసవ్వాలి. గరిష్ఠ వయసు 30 ఏళ్లు.
మెస్ హెల్పర్- 442: పదో తరగతి పాసై, ఐదేళ్లు స్కూల్ మెస్‌లో పనిచేసిన అనుభవం అవసరం. నవోదయ విద్యా సమితి నిర్వహించే స్కిల్ టెస్ట్ పాసవ్వాలి. గరిష్ఠ వయసు 30.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్-19: పదో తరగతి పాసవ్వాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.
పోస్టును బట్టి వయః పరిమితిలో తేడాలు ఉన్నాయి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం.
దరఖాస్తుకు చివరి తేదీ: 30.04.2024
వెబ్‌సైట్: www.navodaya.gov.in
Discussion about this post