ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి క్రీడాపోటీలకు నకిలీ మకిలి అంటుకుంది. చిత్తూరు మెసానికల్ మైదానంలో కబడ్డీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో నగరి జట్టు పూతలపట్టుపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. తొలి సెమీస్‌లో గెలిచి ఫైనల్‌కు అర్హత పొందిన కుప్పంపై జీడీనెల్లూరు జట్టు అభియోగాన్ని మోపింది. స్థానికేతరులైన నకిలీ ఆటగాళ్లను కుప్పం జట్టులో ఆడించారని.. తమ ఓటమికి అదే కారణమని జీడీనెల్లూరు పేర్కొంది. విచారణకు హాజరుకావాలంటూ కుప్పం జట్టును అధికారులు ఆదేశించినా రాలేదు. దీంతో తమనే విజేతగా ప్రకటించాలని రెండో సెమీస్‌లో గెలిచిన నగరి జట్టు పట్టుబట్టింది. ఫైనల్‌లో తమకు అవకాశమివ్వాలని జీడీనెల్లూరు డిమాండ్ చేసింది. చివరకు విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారు నగరి జట్టును విజేతగా ప్రకటించారు.
source : eenadu.net
Discussion about this post