ధర్మవరం సీటు జనసేన పార్టీకే గారికి కేటాయించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన రెడ్డి గారు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీ కాలేజ్ సర్కిల్ నుండి ప్రారంభమై కళాజ్యోతి,ఎన్టీఆర్ సర్కిల్,గాంధీనగర్,చౌడమ్మ గుడి,అక్కడి నుండి చక్రవర్తి హాల్,తేర్ బజార్ అంజుమాన్ సర్కిల్ ల మీదుగా ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు,టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు,బిజెపి అధ్యక్షులు శ్రీమతి పురంధరేశ్వరి గారు సహకరించి ధర్మవరం సీటు జనసేన పార్టీకే కేటాయించాలని ధర్మవరం ప్రజలందరి తరపున కోరుతున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు,వీర మహిళలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
Discussion about this post