ధర్మవరం పట్టణంలో పత్రిక విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని హాస్పిటల్ లో మెడికల్ మాఫియాగా తయారవుతున్నాయి. ప్రతిరోజు పట్టణంలోకి 30 వేల నుండి 40 వేల వరకు రోగాల బారిన పడి రోగులు ప్రైవేట్ హాస్పిటల్ కి వస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఓ మెడికల్ మాఫియాగా తయారై ప్రతి చిన్న జబ్బుకే టెస్టింగ్, స్కానింగ్‌లు లంటూ రోగుల నుండి వేలాది రూపాయలు దండుకుంటున్నారు. టెస్టింగ్ ల్యాబ్ లకు, స్కానింగ్ సెంటర్ లకు ఎలాంటి పర్మిషన్ లేపకపోయినా ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లతో కుమ్మక్కై విచ్చలవిడిగా నడుపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు రోగులు పట్టణ ప్రజలు అధికారులకు చెబుతున్న పెడచోను పెడుతున్నారు. ఇప్పటికైనా డీఎంహెచ్ఓ గారు స్పందించి తగు చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు.
కమీషన్లు కోసం ప్రయివేట్ డాక్టర్ల కక్కుర్తి :-జిల్లాలోని అన్ని పట్టణాలలో ఉన్న, ప్రైవేట్ డాక్టర్లు, మరియు పల్లెల్లో పనిచేసే ఆర్ ఎం పి లు సవేరా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. అందుకు వారికి ప్రతిఫలంగా ప్రతి ఆపరేషన్ పెషేంట్ కు ఛార్జ్ చేసే ఫీజ్‌లో 5నుండి 10% శాతం కమీషన్లు ఇస్తున్నారు. అందుకే ప్రైవేట్ వైద్యులు కమీషన్ కోసం కక్కుర్తి పడి ప్రతి చిన్న ఆపరేషన్‌ను బూతద్దంలో చూపించి, రోగిని భయపెట్టి మరి ఆసుపత్రికి పంపిస్తున్నారు. అదే కాకుండా, సి టి స్కాన్, ఎమ్మార్ ఐ స్కాన్ లో సైతం కమీషన్లు నొక్కుతున్నారు.అంతే కాకుండా రోగికి చేసే అన్ని రక్త పరీక్షల్లో పెద్ద దోపిడీ జరుగుతోంది. డాక్టర్ 50%నుండి 60% కమీషన్ తీసుకుంటున్నారు. వీటిపై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న, మెడికల్ మాఫియాపై ఐ ఏ ఎస్ అధికారితో విచారణ చేపట్టి మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి రవి, సహాయ కార్యదర్శి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, పాల్గోన్నారు
Discussion about this post