ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉన్నదని మరోసారి చాటి చెప్పే సమయం వచ్చిందని ఆ పార్టీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన పెనుకొండలో రా.. కదలిరా.. బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ఊరువాడ జనం కదిలి రావాలని ఆ దిశగా నాయకులు కార్యకర్తలు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారని శ్రీ సత్య సాయి జిల్లాలో జరగబోయే సభ ఒక హైలెట్ గా నిలిచే విధంగా ఉండాలన్నారు. ప్రతి కార్యకర్త నాయకుడు దీనిని బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ బహిరంగ సభకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేసి.. ప్రజలు తరలివచ్చేలా చూడాలన్నారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో పై మంచి స్పందన వచ్చిందని తాజాగా చంద్రబాబు మరిన్ని పథకాలు తీసుకొచ్చే అవకాశం ఉందని శ్రీరామ్ అన్నారు. గతంలో నారా లోకేష్ పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలో ఒక హైలెట్ గా నిలిచిందని.. అదే తరహాలో చంద్రబాబు సభ కూడా విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు..
Discussion about this post