ఇసుక, మద్యం, మట్టి తరలింపు, మత్తుమందు, ఎర్ర చందనం అక్రమ రవాణాలో దోచుకున్న రూ.8 లక్షల కోట్లను ఈ ఎన్నికల్లో ప్రచారాలు, ఇతర వాటికి వైకాపా వెచ్చిస్తోందని తెదేపా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి ఆరోపించారు. ఆదివారం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాస గృహం వద్ద ఆయన మాట్లాడారు. హామీల అమలులో సీఎం జగ్‌మోహన్‌రెడ్డి 85 శాతం విఫలమయ్యారని, అలాంటి వ్యక్తి ఏ మొహంతో ప్రజల ముందుకు వస్తున్నారోనని ఎద్దేవా చేశారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి ధరలు పెంచి చీఫ్‌లిక్కర్ తీసుకొచ్చి డబ్బు దోచుకుంటున్నారన్నారు. విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి 8 దఫాలు పెంచారని, డీజిల్, పెట్రోలు ధరలు పెంచటం వల్ల ప్రజలపై అదనపు భారం పడిందన్నారు.
source : eenadu.net
Discussion about this post