సీఎం జగన్మోహన్‌రెడ్డి దళితుల ద్రోహి అని తెదేపా ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్లు కేటాయింపుల్లో దళిత ఎమ్మెల్యేలకు ఆత్మగౌరవం లేకుండా చేశారని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ప్రజలంతా వ్యతిరేకిస్తున్న ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. ఆయన ఆదివారం జిల్లా తెదేపా కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. మొత్తం 28 మంది దళిత ఎమ్మెల్యేలు మార్చారని, వారిని చులకనగా చూడటం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్‌ను కలవలేదు. ఏం చెబితే అదే చేశాం. ఎందుకు తొలగించారు. కొత్త వారికి ఎందుకు సీటిచ్చారని మీడియా ముందు మాట్లాడిన సందర్భాలు అనేకంగా ఉన్నాయన్నారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దళిత ఎమ్మెల్యే ఆత్మవిశ్వాసంతో ఉండకూడదా? ఆ పార్టీలో దళిత ఎమ్మెల్యేలకు ఎంత గౌరవం ఉందో తేటతెల్లమైందన్నారు. నన్ను ప్రజలు ఎన్నుకున్నారని, పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా నన్ను అవమాన పరుస్తున్నారని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి ఆవేదన వ్యక్తం చేశారని, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థన్ ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు 23 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు.
source : eenadu.net
Discussion about this post