హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ఈరోజు ఉద యం ప్రమాణస్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్ గవ ర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్.. అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు.తమిళిసై రాజీనామా నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయన్ను నియమించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతిని ధులు హాజరయ్యారు.
Discussion about this post