వైకాపా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ఆ పార్టీ శ్రేణులే తీవ్ర నిరాశ నిస్పృహల్లో కనిపిస్తున్నారని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన ఉరవకొండ మండలం బూదగవిలో విలేకరులతో మాట్లాడారు. ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండగా, మేనిఫెస్టో వదిలిన తరువాత వారిలో మరింత నిరుత్సాహాన్ని మిగిల్చిందన్నారు. తెదేపా రూపొందించిన సూపర్ సిక్స్ పథకాల ముందు వైకాపా గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందన్నారు. సూపర్ సిక్స్ విధానం మరింత స్పీడ్‌గా వెళ్లనుందని చెప్పారు. వైకాపా ఎన్నికల ప్రణాళిక విషయంలో ఏవేవో గొప్పలు చెప్పుకొన్న వాళ్లు సైతం నోరు తెరవని పరిస్థితి నెలకొందన్నారు. ఆ ప్రణాళిక వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమి లేదన్నారు. రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని జగన్ తన మేనిఫెస్టో ద్వారా స్పష్టం చేశారన్నారు.
source : eenadu.net
Discussion about this post