రాప్తాడు మండల పరిధిలోని చెర్లోపల్లి, కొత్తపల్లి, గాండ్లపర్తి, పాలచర్లలో శుక్రవారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అధికారులు గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో వైకాపా నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫ్రొటోకాల్ ప్రకారం గ్రామ తెదేపా సర్పంచి లక్ష్మీదేవి పంచాయతీ అధికారుల పిలుపు మేరకు చెర్లోపల్లిలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడున్న వైకాపా నాయకులు కార్యక్రమానికి సర్పంచి అవసరం లేదని, ఇక్కడకు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని ఆమెను అవమానించారు. దీంతో సర్పంచి లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్లిపోగా వైకాపా తరఫున సర్పంచి అభ్యర్థిగా ఓడిపోయిన వారితో కలిసి ఎమ్మెల్యే సచివాలయాన్ని ప్రారంభించారు. భోగినేపల్లికి, పాలచర్లలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభ కార్యక్రమంలో భోగినేపల్లి గ్రామ తెదేపా సర్పంచి బండి ఉజ్జినప్ప పేరు లేకపోవటంతో ఆయన జడ్పీ సీఈఓ నిదియాదేవికి ఫిర్యాదు చేయటంతో అప్పటికప్పడు పేరు చేర్చడం చర్చనీయాంశమైంది.
source : eenadu.net
Discussion about this post