తెదేపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కదిరిలో పీవీఆర్ గ్రాండ్ వద్ద అధినేత చంద్రబాబునాయుడు కేకు కోశారు. బాబు అందరికీ కేకు కోసి పంచడంతో పార్టీ శ్రేణులు ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. అనంతరం అక్కడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలీప్యాడ్‌కు కాన్వాయ్‌తో బాబు బయల్దేరారు. దివ్యాంగుడైన తెలుగు నాడు విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజులు నాయుడు సైదాపురం ఆంజనేయస్వామి ఆలయ వద్ద కాన్యాయ్‌ను ఆపారు. దీంతో చంద్రబాబు వాహనం నుంచి బయటకు రావటంతో అతను పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపారు. అతన్ని బాబు అభినందించారు. అక్కడి నుంచి డిగ్రీ కళాశాల మైదానం చేరుకున్న బాబు హెలిక్యాప్టర్ ఎక్కి బయల్దేరి వెళ్లారు.
source : eenadu.net
Discussion about this post