సైకిల్ గుర్తుకు ఓటేసి తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తు తరాలను బాగుచేద్దామని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని విజయనగర్ కాలనీలో మంగళలవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వచ్చాక తాడిపత్రి పురపాలికను సర్వనాశనం చేశారన్నారు. తెదేపా అధికారంలో రాగానే తాడిపత్రి పురపాలికకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.
నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని గుంతకల్లు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గుత్తి మండలంలోని ఊటకల్లు, బేతపల్లి, వెంకన్నపల్లి గ్రామాల్లో మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయన్నారు.
సైకో పాలన పోవాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి బండారు శ్రావణిశ్రీని గెలిపించాలని తెదేపా మండల నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. నిదనవాడ, రాచేపల్లి గ్రామాల్లో మంగళవారం ఇంటింటి ప్రచారం చేశారు.
source : eenadu.net
Discussion about this post