తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దేశమంతా చాటి చెప్పిన పార్టీ తెదేపా అని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. జిల్లాలో శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో తెదేపా 42వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. జిల్లా తెదేపా కార్యాలయం వద్ద కాలవ శ్రీనివాసులు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు తెదేపా జెండా ఎగరవేశారు. అక్కడే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో పరిటాల సునీత, అనంతపురం అర్బన్ తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్‌టీఆర్ పార్టీని స్థాపించి బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం కల్పించారన్నారు.
source : eenadu.net
Discussion about this post