సైకిల్ గుర్తుకు ఓటువేసి తాడిపత్రి అభివృద్ధికి సహకరించాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి ప్రజలను కోరారు. పట్టణంలోని గాంధీనగర్‌లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్‌సిక్స్ పథకాలను వివరించారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. టీడీపీకి అండగా నిలబడి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన ప్రజలను కోరారు.
జేసీ సోదరులను కలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు: స్థానిక నివాసంలో సోమవారం జేసీ సోదరులను టీడీపీ నూతన జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డిలను కలిసి శాలువాలతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి తన శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ఆయన తెలిపారు. అనంతరం కాకర్ల జయుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 13కుటుంబాల సభ్యులకు వెంకటశివుడుయాదవ్ పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.
source : andhrajyothi.com
Discussion about this post