రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన దగా డీఎస్సీ వద్దని.. మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ), యూత్ కాంగ్రెస్ నాయకులు సోమవారం ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడిని చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్, లక్కారాజు రామారావు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో నిరుద్యోగులే జగన్‌ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
source : eenadu.net
Discussion about this post