టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందనేది అందరికీ తెలిసిన వాస్తవమేనని, అందుకోసమే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు.
‘పొత్తుల కోసం చంద్రబాబు ఎక్కడికైనా వెళ్తాడు. బీజేపీతో ఏదో రకంగా పొత్తు పెట్టుకోవాలని బాబు ప్రయత్నం. ఐదేళ్లలో మేం చేసిన సంక్షేమం చెప్పి ఓట్లు అడుగుతున్నాం. సీఎం జగన్ చేసిన అభివృద్ధే.. మరోసారి గెలిపిస్తుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదు. చంద్రబాబు అద్దె మైకులా షర్మిల మాట్లాడుతున్నారు.టీడీపీ నేతలకు సమాధానం చెబితే షర్మిలకు చెప్పినట్లే.
ఇండియాటుడే సర్వేను సీ ఒటర్ సంస్థతో కలసి చేస్తోంది. గతంలో చేసిన సర్వేల్లోనూ టీడీపీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఆ సంస్థ సర్వే విశ్వసనీయత ఏమిటనేది దీన్ని బట్టి తెలుస్తోంది. బీజేపీ నేతలను తిట్టిన చంద్రబాబు తిరిగి ఆ పార్టీ నేతలను కలవడం విడ్డూరంగా ఉంది . టీడీపికి 18 మంది ఎమ్మెల్యేల బలనే ఉంది. ;ఇక రాజ్యసభకు ఎలా పోటీ చేస్తారు?, రాజ్యసభ రేసులో అభ్యర్థిని నిలపాలన్న టీడీపీ ఆలోచన అనైతికం. చంద్రబాబు ఏమనాలనుకుంటున్నారో అవే మాటలు షర్మిల నోట వస్తున్నాయి’ అని సజ్జల విమర్శించారు.
source : sakshi.com
Discussion about this post