టీడీపీ, జనసేన పార్టీల పొత్తు అట్టర్ ఫ్లాప్ కావడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య స్పష్టం చేశారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేయడానికి పొత్తు రాజకీయానికి తెరలేపారన్నారు. తన అభిమానులు, కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీల పొత్తుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ప్రజా ప్రభుత్వం వైపే ప్రజలు మొగ్గు చూపుతారన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మరోసారి సీఎంను చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన పార్టీలు బంగాళాఖాతంలో కలసిపోతాయన్నారు.
source : sakshi.com
Discussion about this post