టీడీపీ – జనసేన పార్టీలకు సంబంధించినంత వరకూ రాజమహేంద్రవరం రూరల్ రాజకీయం రంజుగా మారుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న పీటముడి ఇంకా వీడటం లేదు. ఇక్కడి నుంచి తాను పోటీ చేస్తానని జనసేన నుంచి ఆ పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్.. కాదు కాదు.. ఈ సీటు తనదేనంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే ప్రకటించుకున్నారు. ఈ పరిస్థితుల్లో రూరల్ సీటు కేటాయింపుపై రెండు పార్టీల శ్రేణుల్లోనూ సస్పెన్స్ ఏర్పడింది.
ముందుగా ప్రకటించుకున్నట్టు దుర్గేష్ పోటీ చేస్తారా.. లేక గోరంట్లకు వదిలేస్తారా అనే విషయం ఎటూ తేలడం లేదు. ఇటీవల మండపేటలో పోటీ చేస్తామని చంద్రబాబు ప్రకటించిన వెంటనే.. రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో పోటీపై పవన్ కల్యాణ్ కూడా హడావుడిగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, రాజమహేంద్రవరం రూరల్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు స్పష్టత ఇవ్వడం లేదు. పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదు. దీంతో రెండు పార్టీల్లోనూ గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
source : sakshi.com
Discussion about this post