రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. మంగళవారం మండలంలోని కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని ఆదర్శనగర్, సుందరయ్య కాలనీ, దండోరా కాలనీ, జాకీర్ కొట్టాల ప్రాంతాల్లో జనసేన రాప్తాడు నియోజక వర్గం ఇనచార్జ్ పవనకుమార్, టీడీపీ, జనసేన నాయకులతో కలసి ఆమె బాబు సూపర్-6 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి.. సూపర్-6 పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అనంతరం నిర్వహించిన సభలో 50 కుటుంబాల నుంచి వంద మంది వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. చింటూ, సుందర్, పవన, సాయిచరణ్, దని, సన్నీ, చరణ్, అనీల్‌కుమార్, మున్నా, షమీర్, నరేష్, ప్రదీప్, దీపక్, నబిరసూల్, బాబా, చిన్నా తదితరులు పార్టీలోకి చేరారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ కార్యకర్త వినోద్‌ను పరామర్శించి రూ.10వేలు ఆర్థిక సాయం చేశారు.
source : andhrajyothi.com
Discussion about this post