జగనన్న మరియు మక్బూల్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తాం అంటున్న – యువకులు,కదిరి మూడవ సారి ముచ్చటగా వైసిపి జెండా ఎగరేయడమే మా లక్ష్యం – యువకులు
కదిరి: తనకల్లు మండల పరిధిలోని తవళం గ్రామపంచాయతీ గందోడువారిపల్లిలో టిడిపి, జనసేన పార్టీలకు చెందిన 20 మంది యువకులు ఎం.జి రెడ్డి గారి సూచనలతో ముబారక్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ గారు, రాష్ట్ర సీఈసీ సభ్యుల పూల శ్రీనివాసరెడ్డి గారు కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారిని కేవలం కార్యకర్తల్లాగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించే సౌమ్యుడు, మంచి మనసున్న బి.ఎస్ మార్బుల్ గారి సమక్షంలో పార్టీలో చేరడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన యువకులకు స్వాగతం చెబుతున్నాం.
సీఎం జగనన్నను రెండవసారి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న ఎం.జి రెడ్డి గారికి అభినందనలు.
పార్టీలో చేరిన ప్రతి యువకుడు వారి మండలంలో అత్యధిక మెజార్టీ సాధించేందుకు ప్రధాన పాత్ర పోషించాలని కోరుతున్నాను.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భాగమైన ప్రతి ఒక్కరూ ఆ పార్టీ కుటుంబ సభ్యులుగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరుతున్నాను.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఎం.జీ రెడ్డితో పార్టీ, మా అందరి సహాయ సహకారాలు, అండదండలు ఉంటాయి.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ననిమున్నిశా సాదిక్ గారు, మండల వైఎస్ఆర్సిపి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Discussion about this post