చంద్రబాబు ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేశాడని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్‌ను 2009 ఎన్నికలకు వాడుకుని వదిలేశారంటూ ధ్వజమెత్తారు. ‘‘ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డాడు. జూనియర్ ఎన్టీఆర్‌పై కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు. సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుని గొయ్యి తీసి పాతిపెట్టాలి. అప్పుడే టీడీపీ బతికి బట్టగడుతుందని కొడాలి నాని అన్నారు.
‘‘అంబేద్కర్ బాటలో నడుస్తున్న సీఎం జగన్‌కు అందరూ అండగా నిలవాలి. మంచి చేస్తేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్నారు. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టాలి. మీ కోసం 120 సార్లు బటన్ నొక్కిన జగన్ కోసం రెండు బటన్‌లు నొక్కండి. ఈ సారికి చంద్రముఖిని ఈవీఎంలలో బంధించండి. ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందంటూ కొడాలి అన్నారు.
source : sakshi.com
Discussion about this post