శ్రీసత్యసాయి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొత్తచెరువుకు చెందిన ఖాజా షకీరాబేగంను నియమించారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాంతియా కుమారి ఈమేరకు శనివారం నియామక ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా షకీరాబేగం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహిళలను చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
source : eenadu.net
Discussion about this post