తమిళనాడు వాసులు కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. తమిళనాడులో ప్రస్తుతం జల్లికట్టు మైలేర్ల సీజన్ కొనసాగుతోంది. మైలేర్లలో వేగంగా పరుగెత్తిన ఎద్దుకు బహుమతులు రూ.10 లక్షల దాకా ఉన్నాయి.
ఇప్పటిదాకా పరుగు పందెంలో కచ్చితంగా గెలిచే ఎద్దులకు కొండ గుర్తుగా రజనీకాంత్, విజయ్, సూర్య ఫొటోలను మాత్రం కొమ్ములకు ప్రభలను కట్టి పందేల్లో వదిలేవారు. ఇప్పుడు వేలూరు, క్రిష్ణగిరి, తిరప్పత్తూరు జిల్లాలోని చాలాచోట్ల జరిగే జల్లికట్టు, మైలేర్లలో ఆంధ్రా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలున్న ప్రభలతో ఎద్దులు కనిపిస్తున్నాయి. పందేలు జరిగేచోట సైతం మైక్‌లో కామెంటరీ చేసేవాళ్లు ఆంధ్రా టైగర్ జగన్ వద్దాండ్రా, సిద్ధం అంటూ పొగడటం విశేషం.
source : sakshi.com
Discussion about this post