అబద్ధాలు చెప్పడంలో నేర్పరి అయిన చంద్రబాబు.. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన చెత్త హామీలు తనకు ఇంకా గుర్తున్నాయని.. కానీ, అలా ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడం వైఎస్సార్‌సీపీ అభిమతం ఎంతమాత్రం కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళగిరిలో ఇవాళ సాయంత్రం జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం ‘మేం సిద్ధం- మా బూత్ సిద్ధం’ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేసే ఈ మీటింగ్‌లో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘2024 ఎన్నికలకు సిద్ధమయ్యాం. రాష్ట్రంలో మనం గ్రౌండ్ లెవల్ నుంచి మనం బలంగా ఉన్నాం. రేపటి నుంచి 45 రోజులు మనకు కీలకం. పూర్తి విశ్వాసంతో మనం చేసిన మంచిని.. చేసే మంచిని ప్రజలకు చెప్పండి. గతంలో బంగారు రుణాలు, రైతు రుణ మాఫీ ఇలా చంద్రబాబు ఇచ్చిన చెత్త ప్రకటనలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు నేర్పరి. కనీసం సాధ్యమవుతుందో లేదో కూడా తెలియకుండానే చంద్రబాబు ఈ వాగ్దానాలన్నీ చేశారు. మనం అలా చేయము. మనం చెప్పేది చేస్తాం! చేసేదే చెప్తాం!.
source : sakshi.com
Discussion about this post