వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెదేపా 2 సీట్లు ప్రకటించినందున తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ పతాకాన్ని పవన్ ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..‘‘తెదేపాతో కలిసే ఎన్నికలకు వెళ్తున్నాం. ఆ పార్టీతో కలిస్తే బలవంతులమవుతాం. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది. పొత్తుల్లో ఒక మాట అటూ ఇటూ ఉంటుంది. ఎన్ని స్థానాలు తీసుకోవాలో నాకు తెలుసు. సీఎం జగన్ కు ఊరంతా శత్రువులే. ఆయనపై వ్యక్తిగత కక్ష లేదు. వైకాపా నేతలకు కష్టమొస్తే నా వద్దకు రండి. పొత్తు దెబ్బతినేలా కొందరు మాట్లాడుతున్నారు. 2024లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు’’ అని అన్నారు.
source : eenadu.net
Discussion about this post