చంద్రబాబుతో పొత్తు అంటే ఇలాగే ఉంటుంది మరి! ఆయన పార్టీ టీడీపీ తప్ప మిత్రపక్షంలోని ఏ పార్టీకి అయినా ఆ తర్వాత పట్టేది అధోగతే. గతంలో వామపక్షాలు, బీజేపీ.. ఇప్పుడు జనసేన. పార్టీ ఎదుగదల దశలోనే జనసేనను చంద్రబాబు చిదిమేశారు. పొత్తుల పేరుతో ఆ పార్టీని రెండు ఉమ్మడి జిల్లాలకే పరిమితం చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను ఓ బొమ్మలా మార్చేసుకొని, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 21 మాత్రమే ఇచ్చి, మమ అనిపించేశారు. రాష్ట్రంలో ఒక బలమైన సామాజికవర్గంలో ఎక్కువ మంది రాజకీయాల్లో ప్రాధాన్యత కోసం పవన్ కళ్యాణ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అలాంటి పార్టీని చంద్రబాబు వ్యూహాత్మకంగా దెబ్బతీసి, పొత్తుల పేరుతో ఉప ప్రాంతీయ పార్టీకన్నా తక్కువ స్థాయికి దిగజార్చారని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాయలసీమ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉండగా, జనసేనకు ఇచ్చిన నియోజకవర్గాలు తిరుపతి, రైల్వే కోడూరు మాత్రమే. ఉమ్మడి శ్రీకాకళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు.. ఈ ఆరు జిల్లాల పరిధిలో 74 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 4 మాత్రమే జనసేనకు వచ్చాయి. ఈ నాలుగింటిలోనూ నెల్లిమర్ల, తెనాలి సీట్లను మాత్రమే జనసేన అధికారికంగా ప్రకటించింది. ఇంకా పాతపట్నం, అవనిగడ్డ స్థానాలు జనసేనకే అని చెబుతున్నప్పటికీ, అధికారికంగా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇలా 126 స్థానాలు (70 శాతానికి పైగా అసెంబ్లీ స్థానాలు) ఉన్న ఈ 10 ఉమ్మడి జిల్లాల్లో జనసేనకు వచ్చిన నియోజకవర్గాలు ఆరు మాత్రమే. అంటే.. కనీసం జిల్లాకు ఒకటి కూడా ఇవ్వలేదు. మిగిలిన మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 స్థానాలు ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో 12 చోట్ల జనసేన పోటీ చేస్తోంది. ఈ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చింది ఈ రెండు జిల్లాల్లోనే. అదీ.. ఉన్న సీట్లలో మూడో వంతుకంటే తక్కువే. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని 15 స్థానాల్లో మూడు చోట్ల మాత్రమే జనసేన పోటీ చేస్తోంది. అంటే ఐదో వంతు స్థానాలతో సరిపెట్టారు.
source : sakshi.com
Discussion about this post