ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు తెదేపా, జనసేన పార్టీల అధినేతలు సిద్ధమయ్యారు. పొత్తు నేపథ్యంలో ఫిబ్రవరిలో సీట్ల సర్దుబాటుపై ఇరుపార్టీలు ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు , పవన్ కల్యాణ్ సమావేశమై చర్చించారు. అతి త్వరలోనే వారిద్దరూ మరోసారి భేటీ కానున్నట్లు సమాచారం.
రానున్న 2-3 రోజులు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు మీదే చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలిసింది. సీట్ల సర్దుబాటు కసరత్తు కోసం ‘రా.. కదలి రా’ సభలకు ఆయన తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాల్లో ఈ సభలు పూర్తికాగా.. వచ్చే నెల 4 నుంచి మిగిలిన చోట్ల నిర్వహించనున్నారు. సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపైనా చంద్రబాబు, పవన్ తుది కసరత్తు చేయనున్నారు.
source : eenadu.net
Discussion about this post