రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కిందట జగన పాలన వినాశనంతో మొదలైందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహకకార్యదర్శి సవిత విమర్శించారు. ఆమె సోమవారం పట్టణం లోని అన్న క్యాంటినలో టీడీపీ శ్రేణులతో సవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడు తూ…. నాలుగున్నరేళ్లకు పైగా విధ్వంశాలు, అరాచకాలతో పాలన సాగించిన సీ ఎం జగన మళ్లీ తన భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టడానికి సిద్దం కావచ్చు కానీ, అందుకు ప్రజలు సిద్దంగా లేరన్నారు. గత ఎన్నికల మునుపు తాను ప్రజలకు ఇచ్చిన హామీలను జగన ఓ సారి నెమరవేసు కోవాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజలు కౌరవులుగా చూస్తున్నారన్నారు. వైసీపీ పాల నలో ప్రజల జీవితాల్లో ఏ మాత్రం మార్పు రాలేదన్నారు. ఈ జగన పాలనలో రాష్ట్ర ప్రజలంద రూ ఆయన బాధితులేనని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధాలతో మళ్లీ అధికారంలోకి రావాలని జగన చూస్తున్నారని సవిత పేర్కొన్నారు. తన పాలనలో సీఎం జగన్మోహనరెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఏం చేశారని ప్రశ్నిం చారు. అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన నేత ఈ సీఎం అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.3లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ ఏమైందని నిలదీశారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, సీపీఎస్ రద్దు హామీలు మూలానపడ్డాయా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో జగన తన ఓటమిని అంగీకరిం చేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాధవనాయుడు, సోము, గుట్టూరు సూరి తదితరులు పాల్గొన్నారు.
source : andhrajyothi.com
Discussion about this post