అనంతపురం రూరల్ మండలం అలుమూరు గ్రామానికి చెందిన అంకే నరేంద్ర టీడీపీ నుంచి వైసిపిలోకి చేరారు. శనివారం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు నరేంద్రకు కండువా కప్పి ఆహ్వానించారు.ఆలమూరు గ్రామానికి చెందిన అంకే నరేంద్ర తదితరులు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా అంకే నరేంద్ర మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం లో ప్రకాష్ రెడ్డి అన్నను మళ్ళీ గెలిపించుకుంటామన్నారు.
Discussion about this post