వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే వచ్చే లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను గెలిపిస్తాయని హిందూపురం ఎంపీ అభ్వర్థి బోయ శాంతమ్మ తెలిపారు. వైసిపి హిందూపురం అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపై ఆమె జగన్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. శనివారం పట్టణంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుఊత బోయ కులానికి చెందిన తనను పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. జగన్మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. హిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
source : prajasakthi.com










Discussion about this post