సూపర్ సిక్స్ పథకాలతో మారనున్న ప్రజల జీవనచిత్రం . ఇంటింటా హారతులతో గ్రామంలో గజమాలతో స్వాగతం పలికిన బీచిగాని పల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ నాయకులు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని వైసీపీ పార్టీ వీడి 10 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టి లోకి చేరిక .
సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారు. ఈ సందర్భంగా సవితమ్మ గారు బీచిగానిపల్లి పంచాయతీ లోని గొల్లపల్లి, బీచిగానిపల్లి పాత్ర గానిపల్లి వంగలపల్లి గ్రామాలలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశ పెట్టే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.
అనంతరం సవితమ్మ గారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో కల్తీ మద్యం, ఇసుక దోపిడీ, భూకబ్జాలు, గంజాయి, డ్రగ్స్, మహిళలపై దాడుల్లో ఏపీని భారత దేశంలోనే జగన్మోహన్ రెడ్డి మొదటి స్థానంలో నిలబెట్టాడని విమర్శించారు.. చంద్రబాబు పాలన అభివృద్ధి సంక్షేమం, దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలబెట్టారు.. టిడిపి పాలనలో ఏపీకి పెట్టుబడులు భారీగా వచ్చాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు భారీగా వచ్చాయి. గత ఐదేళ్లలో వైసిపి వాళ్ళు ఆంద్రప్రదేశ్ కు ఒక పెట్టుబడి కూడా రాలేదు. ఒక కంపెనీ కూడా రాలేదు .యువత నిరుద్యోగ సమస్యతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టిడిపి ప్రభుత్వం తెచ్చిన కంపెనీలన్నీ వైసీపీ పాలనలో పక్కన ఉన్న రాష్ట్రాలు తరలి వెళ్లిపోయాయని ,ఏపీకి రాజధాని లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం పరువు తీసింది అని తెలియజేశారు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు గారిని చేసుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కావున వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారు.ఈకార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…
చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్ బాగుంటుందని పాత్రగానీపల్లి గ్రామం నుండి 10 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టిలోకి పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారి సమక్షంలో చేరారు వారికి ఖండువాలు వేసి ఆహ్వానించిన సవితమ్మ గారు ….
Discussion about this post