సంక్షేమం అనే ముసుగులో సీఎం జగన్ రెడ్డి భారీ దోపిడీ చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గురువారం కడపలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏపీలో జగన్ పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బ్రిటిష్ వారు ఏవిధంగా సొంత సైన్యంతో దోచుకున్నారో… ఆ తరహాలో ఏపీలో జగన్ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. సైకోను తరిమెద్దాం అనే నినాదంతో ముందుకెళ్దామని చెప్పారు. వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు.
source : andhrajyothi.com
Discussion about this post