రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో కొనసాగించినటువంటి అరాచక పాలనపై నారా లోకేశ్ పూరించిన నాదమే శంఖారావమని తెదేపా జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు అన్నారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40-50 రోజులపాటు రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారని అన్నారు. జగన్‌ను ఇంటికి పంపనున్న లోకేశ్‌కు రాష్ట్ర ప్రజలు, పార్టీ నేతలు కార్యకర్తలు మద్దతుగా నిలవాలని కోరారు.
source : eenadu.net










Discussion about this post