రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టేందుకు సహకరించడమే కాకుండా.. జగన్‌ను జైల్లో పెట్టిస్తానని సోనియాగాందీకి ముందే హామీ ఇచ్చింది నువ్వు కాదా అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి వల్లనే రాష్ట్రం విడిపోయిందన్నారు. అన్నమయ్య జిల్లాలోని పీలేరు, గుర్రంకొండ, కలికిరి, వాల్మికిపురం ప్రాంతాల్లో సోమవారం జరిగిన సభలు, సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ముస్లిం మైనారిటీలకు వైఎస్సార్ ప్రవేశపెట్టిన నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ నాయకులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడం ముస్లిం మైనారిటీల హక్కులను కాలరాయడమేనన్నారు.
అలాంటి మతతత్వ పార్టీ తరఫున ఎలా పోటీ చేస్తున్నావని కిరణ్‌పై ధ్వజమెత్తారు.చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ తోడు దొంగలేనని.. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి ప్రజలకు నీడలేకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తే.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు అవకాశం ఉన్నా.. ఓటుకు కోట్లు కేసులో చిక్కుకుని చంద్రబాబు రాత్రికి రాత్రే ఏపీకి పారిపోయి వచ్చి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు రాష్ట్రానికి, ప్రజలకు తీవ్రంగా ద్రోహం చేసిన వారేనని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్ల టీడీపీ పాలనలో అమరావతి పేరు చెప్పి రియల్‌ఎస్టేట్ వ్యాపారంతో నాయకులంతా దోచుకున్నారని విమర్శించారు.
మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు ‘సూపర్ సిక్స్’ హామీలిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు బూటకపు హామీలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి అన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కులమతాలు, పారీ్టలకతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. రైతుల కోసం ఆర్బీకేలు ఏర్పాటు చేసి అన్ని సేవలు అందిస్తున్న ఘనత జగన్‌కే దక్కిందన్నారు. 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్‌రెడ్డిని ఎర్రచందనం స్మగ్లర్, మరో వీరప్పన్ అని విమర్శించిన చంద్రబాబు నేడు అదే వ్యక్తికి పీలేరు అభ్యరి్థగా ఎలా టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు.
source : sakshi.com
Discussion about this post