వడమాలపేట మండలం కాయంగ్రామం వద్ద నిర్మించిన జగనన్న కాలనీ ఇది. గత అక్టోబరులో గృహ ప్రవేశ కార్యక్రమంలో భాగంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లతోపాటు అసంపూర్తి ఇళ్లకు రంగులు వేసి అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇంటి లోపల, వెనుకవైపు చూస్తే నేటికీ అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఇటువైపుగా వచ్చిన జనాలు నిర్మాణం పూర్తికాకుండానే రంగులేంటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఇప్పటికే గృహప్రవేశం చేసిన లబ్ధిదారులు మౌలిక వసతులు లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటి కాలువలు లేకపోవడంతో ఇంటిముందే గుంతలు తవ్వుకుంటున్నారు. రహదారి సరిగా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మట్టితోలిన అధికారులు కనీసం చదును చేయడం లేదని, మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. గృహనిర్మాణ అధికారులు పర్యవేక్షించి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
source : eenad.net
Discussion about this post