ముఖ్యమంత్రిగా జగనన్న మళ్లీ వస్తే అక్కచెల్లెమ్మలకు మరిన్ని సంక్షేమ పథకాలు వస్తా యని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వైఎస్‌ఆర్ ఆసరా నాలుగో విడత మొత్తాన్ని అక్కచెల్లెమ్మలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఎంపీ మాట్లాడుతూ 2019 ఎన్నిక ల సమయంలో జగనన్న డ్వాక్రా మహిళలు ఆ రోజుకు ఎంత బకాయిలు ఉన్నారో వాటిని నాలుగు విడతల్లో ఇస్తానని చెప్పిన మాటకు కట్టుబడి నేటితో ఆ మొత్తాన్ని మీకు చెల్లించారని చెప్పారు. చంద్రబాబు, ప్యాకేజీ పవన్‌లు బాబు వస్తే జాబు వస్తుంది.. మీరు బ్యాంకు బకాయిలు కట్డొద్దు, మాఫీ చేస్తాను..మీ బంగారు నగలు నేనే విడిపిస్తానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన విషయాన్ని మహిళలు గుర్తుకు తెచ్చు కోవాలన్నారు.ఇప్పుడు మళ్లీ మరో కొత్త నాటకంతో మీభవిష్యత్తుకు బాబు గ్యారంటీ అంటూ మోసం చేసేందుకు వస్తున్నారని, వాళ్ల మాయ మాటలను నమ్మి మోసపోవద్దని చెప్పారు. జగనన్న అధికారం లోకి వచ్చాక అమ్మఒడి,విద్యాదీవెన,వసతి దీవెన, విద్యాకానుక, గోరుముద్ద,విదేశీ విద్యాదీవెన వంటి పథకాలు ప్రవేశపట్టి ప్రతి ఒక్కరికీ అండగా నిలిచారని చెప్పారు. నిత్యం మనకోసం తపించే మన సీఎం జగనన్నను మళ్లీ అక్కచెల్లెమ్మలు,అవ్వాతాతలు, అందరూ ఆశీర్వదించాలని కోరారు.అనంతరం ఎంపీ చేతుల మీదుగా మండలంలో 473 సంఘాల్లో ఉన్న 4643 మంది డ్వాక్రా మహిళలకు వైఎస్‌ఆర్ ఆసరా కింద మంజూరైన రు.3,09,38, 850ల మెగా చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, మండల ఇన్‌చార్జి వైఎస్ కొండారెడ్డి,ఎంపీపీ మాధవీ బాలకృష్ణ, జెడ్పీ టీసీ సభ్యుడు శివప్రసాదరెడ్డి, కార్పొరేషన్ల రాష్ట్ర డైరె క్టర్లు ప్రసాదరావు, సభాపతినాయుడు,సర్పంచ్ హర్షాద్,ఎంపీటీసీ లీలా వతి, ఎంపీడీఓ శివారెడ్డి,డీఆర్‌డీఏ పీడీ ఆనందనాయక్,ఏరియా కో ఆర్డినేటర్ నీలకంఠారెడ్డి,ఏపీఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post