టీడీపీ అధినేత చంద్రబాబు మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ఆయన పరిపాలనకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు ఎంత తేడా ఉందో గమనించాలని మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కంబాలపల్లి, తురకలాపట్నం, ఆర్ కుర్లపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వల్ల ప్రతి ఒక్కరికీ లబ్ధి చేరుకూరిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెట్టి ఆ పార్టీ నాయకులకే పథకాలు అందించారని విమర్శించారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న జగనన్నకు అందరూ మళ్లీ అండగా నిలవాలన్నారు. ఈనెల 25న తన నామినేషన్ కార్యక్రమం ఉంటుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరవాలని కోరారు.
source : sakshi.com










Discussion about this post