కడప నుంచి బెంగళూరు వరకు నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టుకు వైకాపా ప్రభుత్వం అడ్డుపుల్ల వేసింది. గతంలో కడప నుంచి ఇడుపులపాయ, లక్కిరెడ్డిపల్లె, మదనపల్లె మీదుగా కర్ణాటకలోని కోలారు-బంగారుపేట లైనులో కలిసేలా ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ పనుల్నీ ప్రారంభించారు. ఒప్పందం మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 వంతున నిర్మాణ వ్యయం భరించాలి. ఈ ప్రాజెక్టు ఆర్థికంగా భారమంటూ కడప నుంచి ముద్దనూరు, ముదిగుబ్బ మీదుగా ధర్మవరం-పుట్టపర్తి లైనులో కలిసేలా ప్రాజెక్టు ఆకృతులు మార్చాలంటూ సీఎం జగన్ రైల్వేబోర్డుకు లేఖ రాశారు. వాటా పంచుకోకపోవడం, రైల్వేలైను మార్పును ప్రతిపాదించడంతో… 22 కిలోమీటర్ల మేర చేపట్టిన లైను పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటికే నిర్మించిన రైల్వేస్టేషన్లు, ట్రాకు… ముళ్లకంపల మధ్య కునారిల్లుతున్నాయి. ఈ దుస్థితిని జగన్ సోదరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కడపలో ఇటీవల ప్రస్తావించి అన్నతీరును ఎండగట్టారు.
source : eenadu.net
Discussion about this post