తిరుపతి గ్రామీణ మండలం పెరుమాళ్లపల్లికి చెందిన దివ్యాంగుడు జీవన్‌కుమార్‌రెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్రగా శనివారం శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల వెళ్లారు. తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు పాదయాత్రగా తిరుమలకు వెళతానని ఆయన చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని ఎమ్మెల్యే కావాలని స్వామివారికి మొక్కుకున్నానని తెలిపారు. వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఈసారి కచ్చితంగా తెదేపా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
source : eenadu.net










Discussion about this post