చంద్రబాబుతో పొత్తు అంటే విష కౌగిలిలో చిక్కుకున్నట్లే. చంద్రబాబుతో ఒకసారి పొత్తు పెట్టుకున్నాక ఆయన ఇచ్చే షాక్‌లతో మిత్రపక్షాలకు బుర్ర తిరగాల్సిందే. గతంలో ఈ దెబ్బ బీజేపీకి గట్టిగానే తగిలింది. ఇప్పుడు జనసేన వంతు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. లోపాయికారీ వ్యవహారంలో భాగంగా జనసేన ఎన్నికల నుంచి దూరంగా ఉంది. టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతు తెలిపింది. అప్పట్లో టీడీపీ – బీజేపీ పొత్తు కుదిరిన రోజున బీజేపీకి 5 లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు.
ఆ తర్వాత వెంటనే ఒక అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానం తగ్గించేశారు. బీజేపీ 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాక వారు బలమైన అభ్యర్థులు కాదంటూ ఓ కారణం చూపించి, మరో అసెంబ్లీ స్థానంలో టీడీపీనే పోటీ చేస్తుందని అప్పటి బీజేపీ రాష్ట్ర నాయకులను బాబు ఒప్పించారు. ఆ తర్వాత బీజేపీకి మిగిలిన 13 స్థానాల్లో సంతనూతలపాడు, గుంతకల్లు, కడప అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు టీడీపీ నాయకులకు అధికారికంగా భీ ఫారాలు ఇచ్చారు. దీంతో ఆ మూడు చోట్లా రెండు పార్టీల అభ్యర్ధులు పోటీ చేశారు.
బీజేపీ జాతీయ నాయకత్వం జోక్యం చేసుకున్నా చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. ఇలా చివరకు బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలనే మిగిల్చారు. రాష్ట్ర విభజనకు ముందు 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. టీఆర్ఎస్కు ఇచ్చిన పలు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు భీ ఫారాలు ఇచ్చి పోటీ చేయించారు. దీంతో ఓట్ల లెక్కింపునకు ముందే టీఆర్‌ఎస్ ఆ కూటమి నుంచి తప్పుకొంది.
source : sakshi.com
Discussion about this post