నెల్లూరు నగరంలో, కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ ఆదివారం నిర్వహించిన ‘రా.. కదలి రా’ సభలు జనం లేక వెలవెలబోయాయి. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖాళీ కుర్చీలను చూస్తూ ప్రసంగించాల్సి వచ్చింది. ఒక్కో సభకు లక్ష మంది చొప్పున రప్పించాలనుకున్న వారి వ్యూహం బెడిసికొట్టింది. కనీసం ఏడెనిమిది వేల మంది చొప్పున కూడా జనం హాజరు కాలేదు. వచ్చిన వారు కూడా బాబు ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయారు. దీంతో స్థానిక నేతలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.
ఇలాగైతే ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళతాయని, ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు, పత్తికొండలో భారీ జన సమీకరణకు ఆ పార్టీ నేతలు యత్నించినా ఫలితం లేకపోయింది. చాలాచోట్ల డబ్బులిస్తామన్నా.. ‘మేము రాము బాబో.. మీ సభలకు’ అంటూ ప్రజలు ముఖంమీదే తేల్చి చెప్పడంతో స్థానిక టీడీపీ నేతలు చేతులెత్తేశారు. రెండు జిల్లాల్లోనూ సభలు జనం లేక వెలవెలబోవడంతో పార్టీ అధిష్టానంతోపాటు క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లిపోయింది.
source : sakshi.com
Discussion about this post