జగన్‌కు, చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు ఈ ఎన్నికలు.. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ యుద్ధంలో తాను ప్రజలపక్షాన ఉన్నానన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 7వ రోజు బుధవారం సాయంత్రం చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పూతలపట్టులో జన మహా సముద్రం కనిపిస్తోందన్నారు.
‘‘మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి మీరంతా సిద్ధమా?. ప్రజలిచ్చిన అధికారంతో ప్రతి ఇంటికి మంచి చేశాం. ఒక వైపు విశ్వసనీయత, మరో వైపు మోసం.. నిజం ఒక వైపు, అబద్ధం మరో వైపు ఉన్నాయి. అబద్ధం, మోసం, అన్యాయం, తిరగోమనం, చీకటిని రిటర్న్ గిప్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు. ఒక్కడి పోరాటానికి ఇంతమంది వస్తున్నారు. ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీల ఏకమవుతున్నాయి. కుట్రలు, కుంతంత్రాలు చేస్తున్నాయి.. ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీ, హోదాలను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
పేదల వ్యతిరేకులు, పెత్తందార్లకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే మన టార్గెట్. 25కి 25కి ఎంపీ సీట్లు గెలవడమే మన టార్గెట్ డబుల్‌సెంచరీ కొట్టేందుకు నేను సిద్ధం. ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి’’ అని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
పేదల వ్యతిరేకులు, పెత్తందార్లకు ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. 175కి 175 అసెంబ్లీ సీట్లు గెలవడమే మన టార్గెట్. 25కి 25కి ఎంపీ సీట్లు గెలవడమే మన టార్గెట్ చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? చంద్రబాబు ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశారా?. వార్డు, సచివాలయాలు చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్. రైతు భరోసా కేంద్రాలు చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్. ప్రభుత్వ బడులను చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్. విలేజ్ క్లినిక్‌లను చూస్తే గుర్తొచ్చేది.. మీ జగన్. వాలంటీర్ వ్యవస్థను తెచ్చింది ఎవరంటే.. మీ జగన్. మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్.. ఒక్క ఓటుపై ఐదేళ్ల భవిష్యత్ ఆధారపడి ఉంది. మే 13న జరగబోయే ఎన్నికల్లో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి’’ సీఎం జగన్ కోరారు.
source : sakshi.com
Discussion about this post