రాజకీయంగా తన ఎదుగుదల, అవసరాల కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడు. ఎవరి వద్దకైనా వెళ్తాడు. స్వలాభం కోసం ఎంతకైనా దిగజారుతాడు. దీనికి ప్రత్యేక ఉదాహరణ.. చంద్రబాబు టీమ్ ఇటీవల ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌ను కలవడం. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై ప్రశాంత్ కిషోర్ సెటైరికల్ పంచ్ వేశారు. చంద్రబాబుది నీతి లేని రాజకీయం అంటూ గాలి తీసేశారు.
ఇక, ప్రశాంత్ కిషోర్ తాజాగా ఓ జాతీయ మీడియాతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా యాంకర్.. మిమ్మల్ని చంద్రబాబు దారుణంగా తిట్టారు కదా.. ఇప్పుడు మళ్లీ మీ సాయం అడుగుతున్నారు మీ స్పందనేంటి అని ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఒక స్మైల్ ఇచ్చి.. చంద్రబాబుకు అవసరం ఉంటే ఆయన ఎవరి వద్దకైనా వెళ్తారు. అవసరం లేనప్పుడు తిట్టిపోసి, అవసరం వచ్చినప్పుడు ప్రాధేయపడటం ఆయనకు అలవాటే.
గత ఎన్నికల సమయంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు తిట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు బీజేపీతో కాళ్లబేరానికి సిద్ధపడుతున్నారు. చంద్రబాబు నీతి లేని రాజకీయం ఇది. ఆయన నైజం కూడా అదే అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. అయినా, తాను టీడీపీకి మద్దతు ఇవ్వలేనని చెప్పినట్టు స్పష్టం చేశారు.
అయితే, అంతకుముందు ప్రశాంత్ కిషోర్‌పై చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు. పీకే బీహార్ గజదొంగ అని, ఆయన వల్లే ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతోందని ప్రచారం చేశారు. హైదరాబాద్‌లోని తమ డేటాను చోరీ చేశారని అన్నారు. ఇక, ఇటీవల మాత్రం.. తమకు మద్దతు ఇవ్వాలని, సాయం చేయాలని పీకేను చంద్రబాబు ప్రాధేయపడిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో భేటీ కోసం ప్రశాంత్ కిశోర్‌ను నారా లోకేష్ ప్రత్యేక విమానంలో విజయవాడకు తీసుకుని వెళ్లారు. ఆ ప్రత్యేక విమానాన్ని బీజేపీలోని చందబ్రాబు పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్‌కు చెందింది. బీజేపీలో ఉంటూనే చంద్రబాబు కోసం సీఎం రమేష్ పనిచేస్తున్నారనేది బహిరంగ రహస్యమే.
source : sakshi.com
Discussion about this post