చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారని అన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కూటమి భాగంగా బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకే టికెట్లు చంద్రబాబు ఇప్పించారని చెప్పుకొచ్చారు.
కాగా, సజ్జల గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారు. చంద్రబాబు సభలకు జనం రావడం లేదు. ప్యాంట్రీ కారుపై కూడా అసత్య ప్రచారం చేశారు. అన్ని అనుమతులు తీసుకున్నా ప్యాంటీ కారుపై తప్పుడు ప్రచారం చేశారు. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదు. బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకే టికెట్లు ఇచ్చారు.
మళ్లీ ఇప్పుడు మోసపూరిత హామీలతో చంద్రబాబు వస్తున్నారు. ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు నిర్ణయించారు. స్పష్టమైన అజెండాతో వైఎస్సార్‌సీపీ ఉందని ప్రజలకు తెలుసు. చంద్రబాబు నకిలీ నోటు అని ప్రజలకు తెలుసు. నోటుపై ఎలాంటి ముద్ర ఉన్నా ఏది ఉన్నా.. నోటు నకిలీది అని తెలిసిన తర్వాత ప్రజలు ఎవరూ అలాంటి నోటును కావాలనుకోరు. అలాగే, చంద్రబాబును కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయి. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని ప్రజలకు తెలుసు. గతంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు మర్చిపోలేదు అంటూ కామెంట్స్ చేశారు.
source : sakshi.com
Discussion about this post