ఉత్తరాంధ్రలో సిద్దం సభకు ఊహించని రెస్పాన్స్ వచ్చిందని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరో మూడు సభలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఏలూరు, అనంతపురంతో పాటు నెల్లూరు లేదా ఒంగోలులో ఇంకో సభ ఉంటుందన్నారు
సీఎం జగన్ కార్యకర్తలను స్వయంగా కలిసి ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది సీఎం జగన్‌కి రెండు కళ్లు లాంటివి. గడిచిన ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు విజన్ కేవలం తన వారిని అభివృద్ధి చేసుకోవటమే’’ అంటూ వైవీ దుయ్యబట్టారు.
‘‘అమరావతి అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రజలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. కచ్చితంగా మూడు రాజ్యసభ సీట్లను కైవసం చేసుకుంటాం. చంద్రబాబు చేసే కుట్రలు ఫలించవు. మా ఎమ్మెల్యేలంతా మావైపే ఉన్నారు’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
source : sakshi.com
Discussion about this post