గెలిచిన ఆరు నెలలోనే సోమరవాండ్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం కనగానపల్లి మండల గుదివాండ్లపల్లి, సోమరవాండ్లపల్లి, నరసంపల్లి, బద్దలాపురం, ఎలకుంట్ల గ్రామాల్లో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీడిపల్లి నుంచి పేరూరు కాలువ నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటా. పరిటాల సునీత మంత్రిగా ఉండి కూడా ఈ కాలువ కోసం 30 కోట్లు ఖర్చు చేయలేదు. ఈ ఐదేళ్లలో మన ప్రభుత్వం 140 కోట్లు ఖర్చు చేశాం. కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో ఆలస్యమైంది. అవసరమైతే తానే స్వంతంగా నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని గత ఎన్నికల్లో మీరంతా శక్తివంచన లేకుండా కష్టపడి నన్ను గెలిపించారు. ఈ ఐదేళ్లలో మీరంతా గర్వంగా తలెత్తుకునేలా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించాం. అనేక అభివృద్ధి పనులు చేశాం. చేస్తూనే ఉన్నాం. గతంలో పరిటాల రవి, పరిటాల సునీత ఇక్కడ మంత్రులు, ఎంఎల్‌ఎలుగా పని చేశారు. వారు చేయలేనటువంటి అనేక మంచి పనులు మనం చేశామని MLA తెలిపారు

Discussion about this post