టీడీపీ తరఫున గుంతకల్లు అస్లెంబీ టికెట్‌ను గుమ్మనూరు జయరామ్‌కు కేటాయిస్తే సహకరించేది లేదని పట్టణ కురుబ సంఘం నాయకులు స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కురవ సాధికరత జిల్లా అధ్యక్షుడు కురబ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు పాలమల్లికార్జున, సీనియర్ నాయకుడు శివప్ప, వశికేరి, కదిరప్ప, సుధాకర్‌యాదవ్ తదితరులు మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న గుంతకల్లు నియోజవర్గంలో మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు చోటు లేదన్నారు. ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన జితేంద్రగౌడ్‌ను కాదని గుమ్మనూర్‌కు టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోందని, ఒక వేళ ఆయనకు టికెట్ కేటాయిస్తే కురుబలు ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీకి ఓటు వేయరని, ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
source : sakshi.com
Discussion about this post